ప్రెస్ నోట్ ఈ రోజు సాయంత్రం, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు, పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్లు శ్రీ దేవుడు బాబు గారు మరియు శ్రీ విజయ్‌కుమార్ గారు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి, మంచి ఆలోచనలతో సమాజంలో సజ్జనులుగా మెలగాలని సూచించారు. ప్రతి ఒక్కరి నడవడికను పోలీసులు తరచూ గమనిస్తారని, ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే, వారి ప్రవర్తన కుటుంబాలపై, సమాజంపై ప్రతిబింబిస్తుందని గుర్తు చేశారు. కుటుంబ సభ్యుల గౌరవం, సమాజంలో మంచి పేరు పొందాలంటే, సన్మార్గంలో నడవడం మాత్రమే మార్గమని తెలియజేశారు. పోలీసులు వారికి మంచి జీవన శైలి, క్రమశిక్షణతో కూడిన నడవడిక, సమాజానికి ఉపయుక్తంగా ఉండే పనులు చేయాలని ప్రోత్సహించారు. సమాజ శాంతి, భద్రత కోసం అందరూ పోలీసులకు సహకరించాలని కోరారు.

Uncategorized
  1. img 20250921 wa0067

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *