అభివృద్ధి పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ ముమ్మన
(కలం లీడర్ న్యూస్) జీవీఎంసీ 95వ వార్డు లక్ష్మీపురం నియర్ మారుతీనగర్ ప్రాంతాలలో జీవీఎంసీ నిధులు రూపాయలు 19.89 లక్షలుతో నూతనముగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన స్థానిక 95వ వార్డు మాజీ కార్పొరేటర్ ముమ్మన దేముడు,ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలు పాటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులు వేగవంతం చేయాలని,తప్పనిసరిగా వాటరింగ్ చేయాలని కాంట్రాక్టరుకు సూచించారు,కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సంతోష్,సచివాలయం సిబ్బంది,మరియు మాజీ సర్పంచ్ పులమరశెట్టి అప్పారావు,బిజెపి 95,97వ వార్డుల ఉపాధ్యక్షులు పిడివి.ప్రసాద్,కెవిఆర్.లక్ష్మి,కె. మాధవి,టిడిపి 95వ వార్డు ప్రధాన కార్యదర్శి మద్దాల శ్రీనివాసరావు,కూటమి నాయకులు ఆడారి సన్యాసిరావు,కాళ్ళ సురేష్,కెవి.సంతోష్ యాదవ్,మరియు కాలనీ ప్రతినిధులు జయలక్ష్మి,లక్ష్మి,వరలక్ష్మి,ప్రతాప్,అప్పారావు,తదితరులు పాల్గొన్నారు,

