20260331 050434

అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఉండకూడదు అనేదే మా కూటమి సంకల్పం*  

అనకాపల్లి

*అర్హత కలిగిన ఏ ఒక్క వ్యక్తి కూడా పెందుర్తి నియోజకవర్గంలో ఇల్లు లేకుండా ఉండకూడదు అనేదే మా కూటమి సంకల్పం*

 

*పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు*

 

ఈ రోజు అనగా 31.03.2026 తేదీన పెందుర్తి నియోజకవర్గం అగనంపూడి జోన్ జీవీఎంసీ 85 వార్డు మంత్రి పాలెం లో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారి చేతుల మీదుగా టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.

 

అర్బన్ లో మంత్రిపాలెంలో 336 టిడ్కో ఇళ్లకు గాను ఈరోజు 144 ఇళ్లకు సంబంధించిన తాళాలను లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని రూరల్ లో 223 ఇళ్లకు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది.

 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో పెందుర్తి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఏం మేలు జరిగినా అది కూటమి ప్రభుత్వం హయాంలో తప్ప మరి ఏ ప్రభుత్వంలోనూ ప్రజలకు మేలు జరగలేదన్నారు. 90 శాతం పనులు పూర్తయిన టిడ్కో ఇళ్లను గత ప్రభుత్వం ఐదు ఏళ్లలో ఆ పది శాతం పూర్తి చేసి వారికి అందజేయ లేని దుస్థితిలో ఉండిపోయింది అన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడంలో తాను కూడా ఒక భాగస్వామిని అయినందుకు తనకు ఎంతో తృప్తిగా ఉందన్నారు. ఇంకా కొంతమంది లబ్ధిదారులకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎవరు భయపడాల్సిన పనిలేదని, ప్రతి ఒక్కరికి సొంతిల్లు కల్పించాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోనీ జీవీఎంసీ వార్డుల్లో రెండేళ్లలో 434 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించామంటే కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

 

ఈ యొక్క కార్యక్రమంలో అగనంపూడి జోన్ జోనల్ కమిషనర్ శేషాద్రి గారు, టిడ్కో హౌసింగ్ డీ ఈ సంధ్య గారు,జీవీఎంసీ ఎపిడిఓ దుర్గా ప్రసాద్ గారు, ఏఈ దీపక్ గారు, శాసనసభ్యుల గారి సోదరులు పంచకర్ల ప్రసాద్ రావు గారు, స్థానిక మాజీ కార్పొరేటర్ ఇల్లపు వరలక్ష్మి ప్రసాద్ గారు, స్థానిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు డొల్ల రాము నాయుడు గారు,జనసేన పార్టీ గవర సోము రాజశేఖర్ గారు, ఇందల రమణ గారు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల అప్పారావు,సత్తి రాజు గారు, పచ్చకూరి లక్ష్మీ గారు,గొల్లవిల్లి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు బొడ్డపు శ్రీనివాసరావు గారు,బిగిడి రామ గోవింద్ గారు, కరణం నర్సింగరావు గారు,వెన్నెల నరసింహారావు గారు,వర్రీ పరదేశి నాయుడు గారు,సుందరపు శ్రీను గారు,దాసరి జయ లక్ష్మీ గారు, మొదలగు పరవాడ మండలం జీవీఎంసీ 85 వార్డు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు మరియు లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *