మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పిలుపు
పెందుర్తి, కలం లీడర్ న్యూస్..అక్టోబర్ 23 మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన రాంపురం కార్యాలయంలో గురువారం మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ప్రజల ఆరోగ్య హక్కులను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గించే వరకు మన పోరాటం ఆగదు. వైయస్సార్సీపీ ప్రభుత్వం కాలంలో ప్రజల కోసం నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం ప్రజలపై ద్రోహం. వైయస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ‘కోటి సంతకాల సేకరణ కార్యక్రమం’ ను విజయవంతం చేయడం మనందరి బాధ్యతని అన్నారు. అదీప్ రాజ్ రేపు ఉదయం సబ్బవరం జంక్షన్, సాయంత్రం పరవాడ జంక్షన్ వద్ద “కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాలు” జరుగనున్నాయని తెలిపారు. ప్రజలందరూ, పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తమ గళం వినిపించాలని
ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బైలపూడి భగవాన్ జయరాం, మధుపాద అంజి, మండలం పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను, వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు, తమర్ల నర్సింగ్, మెంతి మహేష్, గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలు బోరయ్య, గోరపల్లి సాంబ, గొంప అప్పారావు, మువ్వల శ్రీను, శేఖర మంత్రి శ్రీను, మహేష్, బొట్ట గోవింద్, వేపాడ శ్రీను, మురళి, జతిన్, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా వైయస్సార్సీపీ మళ్లీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమ పంథాను కొనసాగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా వైయస్ జగన్ నేతృత్వంలో నడిచిన సంక్షేమ పాలనను గుర్తుచేస్తూ, కొత్త ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం లక్ష్యంగా ఈ సంతకాల సేకరణ కార్యక్రమం రూపుదిద్దుకుంది. మెడికల్ విద్యను అందరికీ అందుబాటులో ఉంచాలన్న సిద్ధాంతంపై వైయస్సార్సీపీ కట్టుబడి ఉన్నదని నేతలు పునరుద్ఘాటిస్తున్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశం

