రోలుగుంట సూరి సినిమా పోస్టర్ ను ఆవిష్కరించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల
విశాఖపట్నం.. పెందుర్తి: అక్టోబర్ 24
(కలం లీడర్ న్యూస్)
పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో గురువారం రోలుగుంట సూరిలి సినిమాకు సంబంధించిన ట్రేలర్ ను మరియు సినిమా పోస్టర్లను ఆవిష్కరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఈ సందర్భంగా పాత్రికేయలతో మాట్లాడుతూ తపస్వి ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఎమోషనల్ డ్రామాతో తెరకెక్కిస్తున్న సౌమ్య చాందిని పల్లా నిర్మాతగా అనిల్ కుమార్ పల్లా దర్శకత్వంలో సినిమా హీరో హీరోయిన్ నాగార్జున ఆద్య రెడ్డి, భావన నటించిన రోలుగుంట సూరి సినిమా ట్రైలర్ మరియు పోస్టర్ను ఆవిష్కరించి సినిమా మంచి విజయం సాధించి జనాలలో మంచి ఆదరణ రావాలని మంచి కలెక్షన్లు సాధించాలని ముందుకు సాగాలని టీము సభ్యులందరకు శుభాకాంక్షలు తెలియజేసిన పంచకర్ల రమేష్ బాబు. సీనియర్ నాయకులు రోమాల చంద్రశేఖర్, కిల్లి వెంకట సత్యనారాయణ, కోరాడ శ్రీనివాసరావు, కోన సోమేశ్వరరావు, కొల్లి కృష్ణ, తాటిపాముల శేఖర్, పల్లా రమణ, పల్లా సత్యనారాయణ, పల్లా గంగరాజు, తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

