*ఈ రోజు పెందుర్తి నియోజకవర్గం రాంపురం కార్యాలయంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు, నియోజకవర్గ పరిశీలకులు దంతులూరు దిలీప్ కుమార్ గారు అధ్వర్యంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో కోటి సంతకాల “ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ*
అదీప్ రాజ్ గారు మాట్లాడుతూ ప్రజలకు కార్పొరేట్ వైద్యం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న సంకల్పంతో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారని అని అన్నారు. కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయటం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వం నిర్ణయానికి వ్యతరేకంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేయిపడతామన్నారు. ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు , ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేతులలోకి అప్పగించాలని కుట్రలను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా కొనసాగుతుంది.
ఈ కార్యక్రమంలో SEC సభ్యులు సర్గడం చిన్న అప్పలనాయుడు, సీనియర్ నాయకులు గండి రవికుమార్, బోకం రామానాయుడు,ఉప్పిలి కనకరాజు,మధుపద అంజి,గొర్ల రాము నాయుడు,మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కోటన రాము,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,కోన రామారావు,వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు, తమర్ల నర్సింగ్, గండ్రెడ్డి మహాలక్ష్మి నాయుడు,దాసరి సత్తిబాబు, మెంతి మహేష్, బోరయ్య ,ఎతురాజుల నాగేశ్వరావు, మోపాడ చందు,ఎడ్ల నాయుడు,ఐడి బాబు ,సిరపురపు వాసు,మహేష్, గోవింద్ పట్నాయక్,కావాలి వాసు తదితరులు ఉన్నారు

