img 20251011 wa0061

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం

*విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ..*

 

*రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా — ప్రజా ఉద్యమం ప్రారంభం..*

 

ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ‘ప్రజా ఉద్యమం’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జిల్లా పార్టీ కార్యాలయంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త *శ్రీ కె.కె రాజు గారు* ఆధ్వర్యంలో జరిగింది.

 

ఈ సందర్భంగా శ్రీ కె.కె రాజు గారు మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు 45 రోజులపాటు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు ప్రారంభించింది.

 

ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు చేతుల్లోకి అప్పగించాలనే కుట్రలను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జోరుగా కొనసాగనుంది.

 

సంతకాల సేకరణలో మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొనాలి.

 

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రజల సొత్తు — వాటి ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం..

 

*ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ గారికి సూటిప్రశ్న…*

 

బీజేపీ నుండి ఆంధ్ర ప్రదేశ్ లో మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అనేక రాష్ట్రంలో బిజెపి అధికారం ఉంది బిజెపి అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పిందా… మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ లను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పుతున్నారు ఆంధ్రప్రదేశ్ అంటే మీకు అంత చిన్న చూపా…

 

ఆంధ్ర ప్రదేశ్ లో తురకపాలెంలో అతిసార సంభవించింది… కురుపాం లో గిరిజన బాలబాలికల హాస్టల్ లో సుమారు వందమంది ఆడపిల్లలకు ఆరోగ్యం బాగోలేకపోతే సరైన వైద్యం అందించలేక ఇద్దరు బాలికలు మరణించారు అక్కడ సరైన వైద్య సదుపాయం లేక వారిని విశాఖ తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు ..

అదే జగన్ గారు పార్వతీపురం విజయనగరం జిల్లాల్లో ప్రారంభించిన మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేస్తే వారికి అక్కడే దగ్గరలో మెరుగైన వైద్యం అందేది కదా అని సూటిగా ప్రశ్నించారు

 

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు,డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు,స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి,కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు,రెయ్యి వెంకటరమణ,బర్కత్ అలీ,కె.వి.యన్ శశికళ,కో-ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు,ఎస్.ఇ.సి మెంబర్ పీలా వెంకటలక్ష్మీ,వాలంటరీ విభాగం జోనల్ ప్రెసిడెంట్ యం.సునీల్ కుమార్,జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు నీలి రవి,కర్రీ రామారెడ్డి,వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి,పైడి రమణ,బొడ్డెటి కిరణ్,బలిరెడ్డి గోవింద్,కె.సుకుమార్,మాజీ కార్పొరేటర్ దల్లి రామకృష్ణ రెడ్డి, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు రాఘవులు,పి.అప్పారావు మాస్టర్,షేఖ్ బాబ్జి,నీలాపు ఈశ్వరవు,హరిపట్నాయక్,మువ్వల సంతోష్,హరికృష్ణ,బిలాల్,బి.సతీష్,లక్ష్మణ్,బాధ శ్రీను,కొట్యాడ సూర్య,జిల్లా కమిటీ నాయకులు బోగవల్లి గోవింద్,ఎర్రంశెట్టి శ్రీను,నూకరాజు,పద్మా శేఖర్,గాలి ప్రసాద్,కె.చిన్న,మహాదాస్య గోపి,రవి,అమ్మాజీ,సీతయ్య రెడ్డి,అప్పల రెడ్డి,సాయి,రిషికేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *