తేది: 10.10.2025
స్థలం: పెందుర్తి
ఈ దినము పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఇన్స్పెక్టర్ శ్రీ కె.వి. సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భాస్కర్ రావు గారు JNNURM కాలనీ, అయ్యప్ప నగర్ వద్ద ఆటో డ్రైవర్లతో మత్తు పదార్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు మత్తు పదార్థాలు (గంజాయి, గుట్కా, బ్రౌన్ షుగర్ తదితరాలు) కలిగి ఉండటం, రవాణా చేయటం వలన కలిగే నష్టం, చట్టపరమైన పరిణామాలు మరియు ఆరోగ్య నష్టాల గురించి సవివరంగా వివరించారు.
అలాగే, యువత భవిష్యత్తును చెడగొట్టే మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని, వాటిని రవాణా చేసే వారిని గాని, నిల్వచేసే వారిని గాని ఎవరైనా గుర్తిస్తే వెంటనే పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారమిచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు మరియు ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సహకారంతో మత్తు రహిత సమాజం నిర్మాణం సాధ్యమని సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ రావు గారు తెలిపారు.
— పెందుర్తి పోలీస్ స్టేషన్, విశాఖపట్నం నగరం 🚔

