అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ముమ్మన
జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లి నియర్ ఎంఈఎస్ లే అవుట్లో జీవీఎంసీ నిధులు సుమారుగా 39.30 లక్షలు రూపాయలుతో నూతనంగా జరుగుతున్న సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన పెందుర్తి బిజెపి నాయకులు,స్థానిక జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు,ఈ సందర్బంగా కార్పొరేటర్ ముమ్మన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా,నాణ్యతా ప్రమాణాలు పాటించి పనులు వేగవంతం చెయ్యాలని,వాటరింగ్ తప్పనిసరని,కాంట్రాక్టరుకు సూచించారు,రోడ్డు సమస్యను పరిష్కరించి నందుకు స్థానిక కోలని ప్రజలు కార్పొరేటర్ ముమ్మన దేముడుకు కృతజ్ఞతలు తెలియజేశారు,కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ భద్ర,మరియు టిడిపి సీనియర్ నాయకులు అయిత ఎర్నిబాబు,సబ్బవరపు ప్రకాష్,బిజెపి 95,97వ వార్డుల సోషల్ మీడియా కన్వీనర్ కంచిబోయిన వెంకట సంతోష్,ఉపాధ్యక్షులు పిడివి.ప్రసాద్,బి. వెంకటరావు,అయిత శివ,కోలని ప్రతినిధులు సత్యనారాయణ,అప్పలనాయుడు,తదితరులు పాల్గొన్నారు,

