కార్మికుల జోలికొస్తే ఖబర్దార్:- ఏఐటీయూసీ నేత ఎస్.కె రహిమాన్

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం

 

తేదీ.28.09.2025,ఆదివారం

 

  • *కార్మికుల జోలికొస్తే ఖబర్దార్:- ఏఐటీయూసీ నేత ఎస్.కె రహిమాన్*

 

*వ్యాపారుల ఆస్తులు ధ్వంసం చేసే హక్కు ఎవిరిచ్చారు :- సీపీఐ జిల్లా నాయకులు ఆర్ శ్రీనివాస్*

 

శ్రీ ముత్యమాంభ చిరు వ్యాపారస్తుల సంఘం 627/2014 గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు వై రాంబాబు అధ్యక్షతన నాయుడుతోట గాయత్రి ఆలయం వెనుక వేపగుంట,సింహాద్రి నగర్, ప్రహ్లాద పురం,నాయుడుతోట జంక్షన్లో వ్యాపారులు సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై ప్రణాళికను చర్చలు జరిపారు. ముందుగా ఏఐటీయూసీ పతకాన్ని ఎస్.కె రహిమాన్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ చిరు వ్యాపారుల ముందస్తుగా సమాచారం లేకుండా వ్యాపారులు తొలగించడమే కాకుండా వారి ఆస్తులను ధ్వంసం చేసే హక్కు ఈ అధికారులకు ఎవ్వరిచ్చారని ప్రశ్నించారు. కోర్టులు కూడా ఒకరి ఆస్తిని ప్రాధిమిక హక్కులు ఉల్లంఘించటం రాజ్యంగా విరుద్ధంమే అని అది చట్టంలో ఉందని అన్నారు. తక్షణమే కార్పొరేటర్లు జీవీఎంసీ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి యథావిధిగా వ్యాపారాలు చేసుకోనివ్వాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో గుర్తింపు పొందిన యూనియన్ లో ప్రథమ స్థానం ఏఐటీయూసీ అని తెలిపారు. కార్మికుల హక్కులకోసం శతాబ్దం నుంచి అలుపెరగని పోరాటాలు చేస్తు ఎన్నో విజయాలు సాధించిందని కొనియాడారు.

 

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల సొమ్ముతో విలాసాలు తిరిగి చిరు వ్యాపారా కార్మికులను గాలికివదిలేశారని విమర్శించారు. మేయర్,కార్పొరేటర్ల కు తెలియకుండానే అధికారులు ఇంత దారుణానికి ఒడిగట్టార అని మండిపడ్డారు. రెండు రోజుల్లో జీవీఎంసీ పాలకవర్గం హాకర్ జోన్ ఏర్పాటు చేసేంత వరకు వ్యాపారాలు కొనసాగించటాని నిర్ణయం తీసుకోవాలని సూచించారు లేని యెడల ఎర్రజెండా చేతపట్టి దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

 

ఈ సమావేశంలో వ్యాపారుల సంఘం ప్రెసిడెంట్ ఈశ్వరావు, సెక్రటరీ నాగరాజు,వైస్ ప్రెసిడెంట్ శరత్,జాయింట్ సెక్రటరీలు ప్రదీప్,నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *