శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం
సింహగిరిపై కమనీయంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం: భక్తి పారవశ్యంలో మునిగితేలిన భక్తులు.
……… …..పాల్గొన్న ఈవో దంపతులు
విశాఖపట్నం, ( కలం లీడర్ న్యూస్ )ఫిబ్రవరి 28, 2026:
సింహాచల పుణ్యక్షేత్రంలో భక్తిభావం వెల్లివిరిసింది. శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన అనుబంధ ఆలయమైన, కొండపై గంగధార చెంత కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, నేత్రపర్వంగా జరిగింది. లోక కళ్యాణార్థం నిర్వహించిన ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు.
ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు మరియు వేద పండితుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం కళ్యాణ ఘట్టాలు ప్రారంభమయ్యాయిఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసచార్యులు మరియు వేద పండితుల ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రం ప్రకారం వేడుకలు ప్రారంభమయ్యాయి. లోక కళ్యాణం కోరుతూ భక్తుల గోత్రనామాలతో సంకల్పం జరిపించి, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనములతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచనములతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం జరిపించారు.
స్వామివారికి, అమ్మవారికి కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ గావించారు. సుముహూర్తాన జీలకర్ర బెల్లం, మాంగల్య ధారణ కార్యక్రమాలను అర్చక బృందం వేద మంత్రాల సాక్షిగా అత్యంత కమనీయంగా నిర్వహించారు.
స్వామి, అమ్మవార్ల శిరస్సుపై ముత్యాల తలంబ్రాల వర్షం కురుస్తుండగా, భక్తుల జయజయధ్వానాల మధ్య గంగధార ప్రాంగణం మారుమోగిపోయింది. అనంతరం మంత్రపుష్పం, మంగళాశాసనములతో కళ్యాణ క్రతువు సంపూర్ణమైంది.
ఈ మహోత్సవంలో ఆలయ ఈవో శ్రీ జె. వెంకటరావు దంపతులు పాల్గొని, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, తీర్థ ప్రసాదాల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
ఈ కళ్యాణ వైభవాన్ని తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారు.
కళ్యాణానంతరం ఈవో శ్రీ జె. వెంకటరావు మాట్లాడుతూ..
“సీతారాముల కళ్యాణం లోకానికి శుభప్రదం. కొండపై గంగధార చెంత కొలువై ఉన్న శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో ఈ వేడుకను భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషదాయకం.”
“స్వామివారి వైభవాన్ని చాటిచెప్పేలా ఈ కళ్యాణాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించాము. సీతారాముల విశిష్టతను అర్చక స్వాములు భక్తులకు వివరించడం విశేషం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనందుకు సంతోషంగా ఉంది” అని తెలిపారు.
కార్యనిర్వహణాధికారి,
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, సింహాచలం.

