ప్
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపురం SC కాలనీలో నివసిస్తున్న అన్నంరెడ్డి సత్యవేణి గారి కుమార్తె అన్నంరెడ్డి ప్రశాంతి (వయసు 16 సంవత్సరాలు), 01.10.2025 ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ఎస్ఐ ఎన్.వి. భాస్కరరావు గారు దర్యాప్తు ప్రారంభించారు.
పెందుర్తి ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారి మార్గదర్శకత్వంలో, దర్యాప్తు బృందం పట్టుదలతో అన్వేషణ కొనసాగించి, అన్నంరెడ్డి ప్రశాంతి గారిని శ్రీకాకుళం బస్ స్టాండ్ వద్ద మతిస్థిమితం లేకుండా తిరుగుతుండగా గుర్తించి సురక్షితంగా పెందుర్తికి తీసుకువచ్చారు. అనంతరం ఆమెను వారి బంధువులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఫిర్యాదుదారులు మరియు ప్రాంత ప్రజలు పోలీసులు చేసిన వేగవంతమైన చర్యలను అభినందించారు.

