img 20260111 wa0216

పెందుర్తి లో పాత్రికేయుల సంక్రాంతి వేడుకలు_*

అనకాపల్లి

*పెందుర్తి లో ఘవిశాఖపట్నంనంగా పాత్రికేయుల సంక్రాంతి వేడుకలు_*
జనవరి12(కలం లీడర్ న్యూస్):
పెందుర్తి మీడియా జర్నలిస్టు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం పెందుర్తి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు సంబరంగా జరిగాయి. అసోసియేషన్ ప్రతినిధుల ప్రసంగాలు, స్వీట్లు, గిఫ్ట్ పంపిణీ తో కోలాహలంగా మారింది. నగరంలో పలు జర్నలిస్టు సంఘాలు ఈసారి సంక్రాంతి సంబరాలకు దూరంగా ఉండడంతో పెందుర్తిలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలకు ప్రాధాన్యత సంతరించుకుంది. వ్యవస్థాపకులు సింగంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీనీయర్ పాత్రికేయులు దాడి వెంకట సూర్యనారాయణ, యలమంచిలి ఆదినారాయణ, వాండ్రంగి సతీష్ కుమార్, కోటిపల్లి నాగేశ్వరరావు, కొలంకి కిషోర్ కుమార్ తదితరులు మాట్లాడుతూ అసోసియేషన్ అందరికీ అండగా ఉంటుందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు‌. అనంతరం పాత్రికేయ లందరికీ స్వీట్, హాట్, గిఫ్ట్ ను అందజేసారు. భోజనాలనంతరం కార్యక్రమం ముగిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *