వేపగుంటలో అత్యంత వైభవంగా
శ్రీ ముత్యమాంబ అమ్మవారు పండగ
పెందుర్తి, (కలం లీడర్ న్యూస్):
వేపగుంట వీరబ్రహ్మేంద్ర సేవా సంఘం ఆధ్వర్యంలో 94వ వార్డులో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ ముత్యమాంబ పండగ సందర్భంగా గురువారం భక్తులకు పులిహోర పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. పండగ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు తెల్లవారుజామున క్యూ లైన్లో అమ్మవారికి పసుపు, కుంకుమలు మొక్కుబడులు సమర్పించుకున్న.
ప్రత్యేక పూజలు, హారతులతో అమ్మవారిని దర్శించుకున్న అనంతరం భక్తులకు ప్రసాదంగా పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సేవాభావంతో నిర్వహించబడిందని, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. వేపగుంట నాలుగు రోడ్డు కూడలిలో భారీ విద్యుత్ దీప అలంకరణ చేశారు. సాయంత్రం పలు సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు

