img 20251004 wa0050

భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన కార్పొరేటర్ ముమ్మన

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం

 

  • భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించిన కార్పొరేటర్ ముమ్మన

 

జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లి నియర్ ఎంఈఎస్ లే అవుట్ లో ఆర్ జె ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు,కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పెందుర్తి బిజెపి నాయకులు,జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని,అమ్మవారికి విశేష కుంకుమ పూజలు చేశారు,అనంతరం 3000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మన భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు,శ్రీ దుర్గాదేవి అమ్మవారి చల్లని దీవెనలు,కృపా కటాక్షాలు ఈ ప్రాంత ప్రజలపై మెండుగా ఉండాలని కార్పొరేటర్ ముమ్మన ఆకాంక్షించారు,కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు అయిత ఎర్నిబాబు,బిజెపి 95,97వ వార్డుల సోషల్ మీడియా కన్వీనర్ కంచిబోయిన వెంకట సంతోష్,సెక్రటరీ కొత్తపల్లి అప్పలరాజు,అయిత శివ,బి. వెంకటరావు,కోలని ప్రతినిధులు నాయుడు,బాబురావు,సింగ్,కృష్ణ,అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *