img 20260220 wa0036

మానవత్వాన్ని చాటుకుంటున్న సాయి హెల్పింగ్ హాండ్స్ సేవలు

అనకాపల్లి విశాఖపట్నం

మానవత్వాన్ని చాటుకుంటున్న సాయి హెల్పింగ్ హాండ్స్ సేవలు

కలం లీడర్ న్యూస్ : పెందుర్తి లో కొంతకాలం నుండి సమాజ సేవలో సేవలు అందిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ మరో అడుగు మందుకు వేసింది. అనాధ మృతదేహాలకు ఆర్థికంగా వెనకబడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన వారికి గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రి నుండి తమ ఇంటికి చేరేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదవారికి సహాయాన్ని అందించాలనే మానవతా దృక్పథంతో శ్రీ సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ సరికొత్త మూడు వాహనాలను అందుబాటులో కి తీసుకువచ్చారు. శుక్రవారం ఉదయం అనకాపల్లి మాజీ శాసనసభ్యుడు పీల గోవింద సత్యనారాయణ డి ఆర్ సి చారిటబుల్ ట్రస్ట్ అధినేత దాడి రమణ చెట్టి చేతుల మీదుగా వాహనాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీల గోవిందు మాట్లాడుతూ సుమారు పది సంవత్సరాల నుండి ఈ చారిటబుల్ ట్రస్టు ప్రజలకు ఉచిత సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక ప్రాణాపాయ స్థితిలో రక్తదానాన్ని అందిస్తూ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తూ బాధిత రోగులకు అవయవదనాలు, నేత్రదానం, ఆక్సిజన్ సేవలు కూడా అందించడం గొప్ప విషయం అని కొనియాడారు మరింత ముందుకు ఈ సేవలో కొనసాగించాలని సాయి హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాడి శ్రీనును, వాళ్ల కమిటీ సభ్యులను పీలా గోవింద్ అభినందించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *