20260202 104411

వైసీపీ నేత అంబటి రాంబాబు కుశిక్ష పడాల్సిందే

అనకాపల్లి

పెందుర్తి, (కలం లీడర్ న్యూస్ )ఫిబ్రవరి 3:
ఏపీ సీఎం చ ంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పెందుర్తి సీఐ కేవీ సత్ కుమార్కు ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి గండి బాజ్జీ ఆధ్వర్యంలో సీఐ కేవీ సతీష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాజ్జీ మాట్లాడుతూ ప్రజా స్వామ్యంలో అంబటి రాంబాబు వంటి వ్యక్తులుండడం దౌర్భాగ్యమని, అతడ్ని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్య

హక్కుల్ని కాపాడాలన్నారు. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే, దాన్ని చింపేస్తాను.. టీడీపీ నాయకుల్ని కొరికేస్తానంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన అంబటిని శిక్షించకపోతే వైసీపీ నేతలు మరికొందరు అలాగే విర్రవీగుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణ రావు, టీడీపీ స్థానిక నేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *