వృద్ధాశ్రమంలో అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పదోవ వార్షికోత్సవ వేడుకలు
జర్నలిస్టుల భద్రత లక్ష్యంగా OWJA ముందుకు వెళ్తాది అంటున్నా వ్యవస్థాపక అధ్యక్షులు వాల్మీకి నాగరాజు
ఆవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ పదో వ వార్షికోత్సవం వేడుకలు వ్యవసాయ అధ్యక్షులు వాల్మీకి నాగరాజు పిలుపుమేరకు OWJA కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.. పది సంవత్సరాల పూర్తి చేసుకుని 11వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంగా పెందుర్తి లోయలో వృద్ధాశ్రమంలో భోజనాలు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు వాల్మీకి నాగరాజు మాట్లాడుతూ 2015లో ప్రారంభించిన ఈ అవర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నో సేవా కార్యక్రమాలు పోరాటాలు చేసిందని, అలాగే జర్నలిస్టు ఆరోగ్య సమస్యతో బాధపడుతుంటే ఆర్థికంగా సహాయం అందించడం తోపాటు కుటుంబ బాధ్యత కు ఇన్సూరెన్స్ లు కూడా చేయడం జరిగింది అని ఆయన తెలియజేశారు.. రానున్న రోజుల్లో అసోసియేషన్ అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని. జర్నలిస్టులు భద్రతను దృష్టిలో పెట్టుకుని OWJA ముందుకు వెళుతుందని ఆయన అన్నారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వర బాబు, విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు గొర్రెల ఈశ్వరరావు, సహాయక కార్యదర్శి నేతాజీ, ఆర్గనైజింగ్ సెక్రెటరీ కార్తిక్, మరియు మీడియా మిత్రులు అంబటి శేషు,బొడ్డేటి రాము అక్కిరెడ్డి గణేష్ పాల్గొన్నారు..

