ఘనంగా బీజేపీ నేత గొర్లె రామునాయుడు జన్మదిన వేడుకలు…..
కలం లీడర్ న్యూస్ (పెందుర్తి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, పెందుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జ్ గొర్లె రామునాయుడు జన్మ దిన వేడుకలు పెందుర్తి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ నగర మేయర్ పీలా శ్రీనివాస రావు విచ్చేసి రాము నాయుడు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. ఆయనతోపాటు టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్చార్జి గండి బాబ్జ, 94, 95, 97వ వార్డు కార్పొరేటర్లు బర్ల శ్రీను, ముమ్మన దేవుడు, సేనాపతి వసంత శంకర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ అవగడ్డ అప్పలనాయుడు, పీఏసీ ఎస్ ఐదు సింహాచలం మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణ రావు తదితరులు రామునాయుడుకు జన్మదిన శుభా కాంక్షలు తెలిపారు. అందరి సమక్షంలో రామునాయుడు జన్మదిన కేకును కట్ చేశారు. వక్తలు మాట్లాడుతూ రామునాయుడు మరిన్ని ఉన్నత పదవులను అధిరోహిం చాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఆపన్నులకు అండగా నిలుస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలందరి ప్రేమాభిమానాలను సొంతం చేసుకుని మరిన్ని ఉన్నత స్థానానికి ఎదగాలని శుభాకాంక్షలు తెలి పారు. ఈసందర్భంగా గొర్లె రామునాయుడు తన వంతు సహాయంగా 500 మందికిపైగా పేద ప్రజలకు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు.

