*పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కూటమి నేతల పై పిర్యాదు చేసిన పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్
( కలం లీడర్ న్యూస్) పెందుర్తి మాజీ శాసనసభ్యులు మరియు నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్ రాజ్ అధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి పెందుర్తి పోలీసు స్టేషన్ లో సి ఐ సతీష్ కుమార్ కి పిర్యాదు చేశారు.
అదీప్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు కనుసన్నల్లో హిందువులు,ప్రజలు మనోభావాలను కించపరిచేలా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పెడుతూ మాజీ ముఖ్య మంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్ వై వి సుబ్బారెడ్డి ,భూమన కరుణాకర రెడ్డి ఫోటోలను వేసి ఆరోపణలను చేస్తున్నారు.దీని పైన ప్రశ్నిస్తున్న మా నాయకులు అంబటి రాంబాబు,జోగి రమేష్,శ్రీమతి విడదల రజిని,శ్రీ బ్రహ్మనాయుడు గారు పైన భౌతిక దాడులు,ఆస్తులు ధ్వంసం చేస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలును రెడ్ బుక్ రాజ్యాంగం తో నడుపిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం జిల్లా పరిశీలకులు సర్గడం చిన అప్పలనాయుడు,పరవాడ జడ్పీటీసీ పైలా సన్యాసి రాజు,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,వార్డు అధ్యక్షులు రాపర్తి మాధవరావు (95),దాసరి సత్తిబాబు (93),తమర్ల నర్సింగ్ రావు (94),మెంతి మహేష్ (97),అప్పికొండ మహాలక్ష్మీ నాయుడు (88),మాజీ పాక్స్ చైర్మన్ గొర్ల రామునాయుడు,మాజీ కార్పొరేటర్ చొప్ప నాగరాజు,సీనియర్ నాయకులు పీతల విష్ణు,కోన శ్రీను, గొంప అప్పారావు, మళ్ళ నూక అప్పారావు,రాష్ట్ర ఎస్ సి సెల్ ప్రధాన కార్యదర్శి ఐడి బాబు, రాష్ట్ర యువజన విభాగం అధికార ప్రతినిధి కోరాడ చందు యాదవ్,జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్,జిల్లా ఐటీ సెల్ వైస్ ప్రెసిడెంట్ జతిన్ యాదవ్,సన్నీ,మహేష్,ఎర్రయ్య,జగదీష్,మువ్వల శ్రీను,ఆకుల వాసు,వేపాడ శ్రీను,గోవింద్, వర్మ,రాంబాబు,రజిని,ప్రసన్న,అనిత,తదితరులు ఉన్నారు.

