విశాఖ దక్షిణం, ఫిబ్రవరి 2, (కలం లీడర్ న్యూస్): ఆర్కే బీచ్ వద్ద ఆదివారం పెన్ స్కూల్ ఆధ్వర్యంలో పిల్లల్లో ఆరోగ్య అవగాహన, శారీరక దృఢత్వం పెంపొందించాలన్న లక్ష్యంతో మినీ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెన్ స్కూలుకు చెందిన చిన్నారులు మూడు సంవత్సరముల నుండి ఆరు సంవత్సరముల వయసు గల 301మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు ముఖ్యఅతిథిగా డాక్టర్ రాధాకృష్ణ రిబ్బన్ కటింగ్ చేసి జెండా ఊపి మారుథాన్ను ప్రారంభించారు. ఈ మినీ మారుథాన్ వైఎంసిఏ నుండి అంబికా సీ గ్రీన్ వరకు బీచ్ రోడ్డు మీదుగా సాగింది. పాఠశాల అధ్యక్షురాలు అనిత పెరేరా మాట్లాడుతూ పిల్లలు నిత్యం వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా మారుతారని అన్నారు. క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. మినీ మారథాన్లో పాల్గొన్న విద్యార్థులకు పథకాలు సర్టిఫికెట్లు అందజేశారు.

