img 20260202 wa0011

హౌసింగ్ ప్రొసీడింగ్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే పంచకర్ల

అనకాపల్లి

కలం లీడర్ న్యూస్ ..పెందుర్తి: ప్రధానమంత్రి ఆవాస్

యోజన పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్దిదారులకు అర్బన్ హౌసింగ్ ప్రొసీడింగ్ లెటర్స్న ఇంటి నిర్మాణదారులకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పంపిణీ చేశారు. ఆదివారం ఉదయం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో అర్బన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న జీవీఎంసీ 94వ వార్డు వేపగుంట వెంకట సాయి నగర్ కాలనీ నివాసతులకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు కట్టుకున్నట్టుకు అర్హులైన లబ్ధిదారులకు అర్బన్

హౌసింగ్ ప్రొసీడింగ్ లెటర్స్ ను ఆయన అందజేసారు. అలాగే సీఎం సహాయనిధి ద్వారా లబ్ధి పొందిన 5 మంది బాధిత కుటుంబాలకు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 3,81,740 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే రమేష్ బాబు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, చెరువు సంఘం చైర్మన్ సదరం భీమేశ్వరరావు, 94 వార్డు సభ్యులు పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్.ఎస్ నాయుడు, గొర్రె అప్పారావు, కోరుబిల్లి సంతోష్, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎల్లపు శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు దాట్ల మధు, పిల్లా జగన్మోహన్ పాత్రుడు, మడక బంగార్రాజు బైలపూడి హరగోపాల్,జుత్తాడ శ్రీనివాసరావు, తనకాల శ్రీనివాస్ రావు, మోటూరు చైతన్య, తైనాల మహేష్, అర్జున్ చౌదరి, గన్రెడ్డి రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *