సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలలో పాల్గొన్న కార్పొరేటర్ ముమ్మన
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి మహోత్సవం పురస్కరించుకొని జీవీఎంసీ 95వ వార్డు చీమలాపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ కోదండ సీతారామాలయ సముదాయంలో వేంచేసియున్న శ్రీశ్రీశ్రీ వల్లీ,దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు,గ్రామ పెద్దలు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా పెందుర్తి బిజెపి నాయకులు,స్థానిక 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేముడు పాల్గొని,కళ్యాణాన్ని తిలకించారు,అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు,తీర్ధప్రసాదములు స్వీకరించారు,ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సుబ్రహ్మణ్య షష్టి (లేదా స్కంద షష్ఠి) అనేది శివుని కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని (కుమారస్వామి,కార్తికేయుడు, స్కందుడు,మురుగన్) ఆరాధించే పండుగ అని ఇది మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి నాడు వస్తుంది అని ఈ రోజున స్వామివారు రాక్షసులను సంహరించినందుకు గుర్తింపుగా,విశేష పూజలు చేస్తారని అన్నారు,శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలుపై మెండుగా ఉండాలని ఆకాంక్షించారు,కార్యక్రమంలో టిడిపి 95వ వార్డు అధ్యక్షులు అయిత ఎర్నిబాబు,బిజెపి 95,97వ వార్డుల సోషల్ మీడియా కన్వీనర్ కంచిబోయిన వెంకట సంతోష్,టిడిపి నాయకులు సబ్బవరపు డాక్టర్ ప్రకాష్,ఆలయ కమిటీ సభ్యులు,ఆలయ ధర్మకర్త,అధ్యక్షులు అయిత యెర్రయ్య,ఆలయ ఉపాధ్యక్షులు మింది నాగరాజు,దువ్వి అప్పారావు,అయిత అప్పలరాజు,బొట్ట కృష్ణ,బొట్ట నూక అప్పలరాజు,అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు,

