*శ్రీశ్రీశ్రీ అమ్మవారి సేవలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్,పద్మజ దంపతులు పాల్గొన్నారు
*వైభవంగా ప్రారంభమైన చివర గురువారం పూజా కార్యక్రమం*
ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు జరిగిన చివరి గురువారం ప్రారంభ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పద్మజ దంపతులు పాల్గొన్నారు అమ్మవారి అంతరాలయం లో పంచామృతాలతో ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు అమ్మవారి అభిషేకం అనంతరం ఆలయ పండితులు వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థ ప్రసాదములు అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడు తూ అమ్మవారి మార్గసర మాసోత్సవములు ఎంత ఘనంగా నిర్వహించామని చివరివారం భక్తులు అమ్మ వారిని దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు కార్య క్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఈ రమణ, ఏఈఓ రాజేంద్ర,ఆనంద్ కుమార్ ఉత్సవ కమిటీ, భక్తులు పాల్గొన్నారు.

