img 20251025 wa0066

పెందుర్తి నియోజకవర్గం నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పంచకర్ల

అనకాపల్లి విశాఖపట్నం

పెందుర్తి నియోజకవర్గం నాగుల చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పంచకర్ల

 

కలం లీడర్ న్యూస్-పెందుర్తి

 

జనసేనపార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు నియోజకవర్గం ప్రజలకు నాగుల చవితి శుభాకాంక్షలు తెలియచేసారు. శనివారం నాగుల చవితిని పురస్కరించుకొని జీవీఎంసీ 97వ వార్డు శ్రీ లక్ష్మీ నగర్ (కిషోర్ లేఔట్) లో కుటుంబ సమేతంగా పుట్టలో పాలు పోసి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగలు కుటుంబాల కలయికలకు, అనుబంధాలు ఆత్మీయతలు కొనసాగడానికి ఉపయోగపడతాయని అన్నారు. ప్రతి హిందూ పండుగలోనూ ఒక పరమార్థం దాగి ఉంటుందని, వాటిని తూచా తప్పకుండా ఆచరించడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. చెట్లను, పక్షులను, జంతువులను కూడా దేవుళ్ళుగా భావించి పూజించడం హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేశ్ బాబు సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సేనాపతి శంకర్రావు, ముదునూరి రాజా సుధాకర్, కరణం కనకారావు, ఏఎంసీ డైరెక్టర్స్ ఆర్ఎస్ నాయుడు, ముమ్మన సతీష్, గొంతున హైమావతి, వార్డు అధ్యక్షులు పిన్నింటి పార్వతి, కంచిపాటి మధు, డిబిఎల్ నాయుడు, తమరాడ ఆది బాబు, సీనియర్ నాయకులు పిల్లా జగన్మోహన్ పాత్రుడు, గొర్లి అప్పారావు, నీటిపల్లి మహేష్, రాపర్తి కిషోర్, తలారి శ్రీనివాసరావు, త్రిబుల్ ఎస్ రమేష్ చిన్నముసిడివాడ గ్రామ పెద్దలు శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ పెద్దలు, ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *