ఎంపీ సీఎం రమేష్ మాతృమూర్తికి నివాళులు
కలం లీడర్ న్యూస్- పెందుర్తి అనకాపల్లి పార్లమెంటు సభ్యులు
సీఎం రమేష్ మాతృమూర్తి చింతగుంట రత్నమ్మ అంత్యక్రియల్లో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని ఘన
నివాళులర్పించారు. గురువారం కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, పొట్లదుర్తి గ్రామంలో నిర్వహించిన చింతకుంట రత్నమ్మ అంత్యక్రియల్లో అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, భీమిలి శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు సహా పలువురు ఎమ్మెల్యేలు, కూటమి నాయకులతో కలసి రమేష్ బాబు పాల్గొన్నారు. రత్నమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసే నివాళులర్పించిన అనంతరం ఎంపీ సీ. ఎం. రమేష్ తండ్రి మునిస్వామి నాయుడు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని తెలిపారు. రత్నమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసి ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం జరిగిన అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

