విశాఖపట్నం ..పెందుర్తి. కలం లీడర్ న్యూస్…
ఈరోజు పెందుర్తి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె.వి. సతీష్ కుమార్ గారు సుజాతనగర్ రత్నగిరి నగర్ పార్క్‌లో ప్రజలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీవాసులు, మహిళలు, యువతులు పాల్గొన్నారు.
ఇన్స్పెక్టర్ గారు ముఖ్యంగా ఈ విషయాలను వివరించారు:
మహిళలపై నేరాలు: మహిళలపై ఎవరైనా నేరకార్యం చేసినట్లయితే వెంటనే పోలీస్‌కి తెలియచేయాలని సూచించారు. పోలీసులు ఎల్లప్పుడూ మహిళలతో ఉంటారు. సమాచారం పూర్తిగా గోప్యంగా ఉంచబడుతుంది అని హామీ ఇచ్చారు.
సైబర్ నేరాలు: ఫైబర్ నేరాలు, మోసపూరిత కార్యకలాపాల గురించి వివరించారు. ఎవరు సైబర్ నేరాలకు గురవుతారో జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరైనా ఇబ్బందులలో ఉంటే పోలీసులను సంప్రదించాలని సూచించారు.
మద్యం, డ్రగ్స్: గంజాయి లేదా ఇతర నేరకార్యాలతో దూరంగా ఉండాలని, మంచి భవిష్యత్తు కోసం సరైన మార్గంలో ఉండాలని తెలియచేశారు.
సామాజిక సమాచారం: అసాంఘిక కార్యకలాపాల గురించి ఎవరికైనా సమాచారం ఉంటే, దానిని పెందుర్తి పోలీస్ స్టేషన్‌కి తెలియచేయవచ్చని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
ఇన్స్పెక్టర్ గారు ఈ అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా ప్రజల భద్రత మరియు సమాజంలో న్యాయ పరిరక్షణకు స్ఫూర్తి కల్పించారు.
పెందుర్తి పోలీస్ స్టేషన్

