img 20251021 wa0060

జీవీఎంసీ కమిషనర్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు భేటీ

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం
  1. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ను మంగళవారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు -మర్యాదపూర్వకంగా కలిశారు. పెందుర్తి నియోజకవర్గం జీవీఎంసీ సంబంధించిన -అభివృద్ధికార్యక్రమాలగురించి కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. పెందుర్తి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆయనకు వివరించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. నియోజక వర్గంలో జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న -అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు తదుపరి చర్యలు తీసుకోవాలని కోరారు. వేపగుంట నుంచి పినగాడి వరకు ప్రతిపాదించిన రోడ్డులో జీవీఎంసీ పూర్తి చేయవలసిన రోడ్డు పనులను -సత్వరమే ప్రారంభించి పూర్తి చేయాలని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన వెంటనే స్పందించి ఈ రోడ్డు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని సంబంధిత జీవీఎంసీ అధికారులను కమిషనర్ ఆదేశించారు. జీవీఎంసీ జోన్ 6.8 పరిధిలో ప్రతిపాదించిన రోడ్లు, డ్రైన్స్ కల్వర్టులుపార్కులకు -సంబంధించిన పనులను వెంటనే మంజూరు చేసేందుకు కమిషనర్ ఆమోదం తెలిపారు. అదేవిధంగా ఐ -మాక్స్ లైట్లు, ప్రధాన కూడలిలో రింగ్పోల్ ఐ మాక్స్ లైట్లు మంజూరు చేసేందుకు ఆమోదించారు. ప్రస్తుతం ప్రగతిలో ఉన్న రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వినతిపత్రంలో కమిషనరుకు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *