7273 వార్డులలో పారిశు ద్ధ్య పనులను ప,రిశీలించిన జీవీఎంసీ కమిషనర్
విశాఖపట్నం జనవరి 20: (కలం లీడర్ న్యూస్)
పారిశుద్ధ్య నిర్వహణలో ఆలసత్వం ప్రదర్శించరాదని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ప్రజా ఆరోగ్య అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జీవీఎంసీ పరిధిలోని 72, 73 వార్డులలో లోని పలు ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ ఆయా వార్డుల
శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ కార్యదర్శులు , పారిశుద్ధ్య కార్మికుల హాజరు పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి అలసత్వం కనపరచరాదని అధికారులను, సానిటరీ ఇన్స్పెక్టర్లను, వార్డు శానిటరీ కార్యదర్శులను ఆదేశించారు. ప్రతిరోజు క్లాప్ వాహనాలు ఏ ఏ సమయాలలో ఎన్ని ట్రిప్పులు వేస్తున్నారని కార్యదర్శులను ఆరా తీశారు. క్లాప్ వాహనాలు నిర్ణీత సమయానికే విధుల్లో ఉండి ప్రతిరోజు మూడు ట్రిప్పులు తప్పనిసరిగా వేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు రోడ్లు,కాలువలు శుభ్రపరిచి ఆయా వ్యర్ధాలను వెనువెంటనే డంపింగ్ యార్డ్ కు తరలించే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్మికులను పిన్ పాయింట్ వారీగా సర్దుబాటు చేసి ఎక్కడా వ్యర్ధాలు లేకుండా చూడాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ త్వరలో నగరమంతా జరుగనున్నందున నగరంలో ప్రతి ప్రాంతం పరిశుభ్రత కలిగి ఉండేలా ప్రజారోగ్య అధికారులు , వార్డు శానిటరీ కార్యదర్శులు తగు చర్యలు చేపట్టాలన్నారు.
ఈ పర్యటనలో సానిటరీ ఇన్స్పెక్టర్లు, సూపర్వైజర్లు, వార్డ్ సానిటరీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పౌర సంబంధాల అధికారి,
జీవీఎంసీ

