*స్ట్రీట్ వెండర్స్, ఫుడ్ కోర్ట్ వ్యాపారులకు తిరిగి స్టాల్స్ ఏర్పాటు*
*అసెంబ్లీ సమావేశాలు ముగియగానే వర్తకుల సమస్యకు పరిష్కారం*
*చిరు వ్యాపారులకు వెండర్ కార్డులతో సహా వ్యాపారాలు
పునరుద్దిస్తాం*
*కూటమి ప్రభుత్వం స్ట్రీట్ వెండర్స్ కు అండగా ఉంటుంది*
*దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్*
నగరంలో తొలిగించిన స్ట్రీట్ వెండర్స్, ఫుట్ కోర్టు వర్తకుల వ్యాపారాలను తిరిగి ఏర్పాటు చేయిస్తానని జనసేన పార్టీ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆపరేషన్ లంగ్స్- 2.0 ద్వారా రోడ్డున పడిన వీధి వ్యాపారస్తుల సమస్యను పరిష్కరిస్తానని ఆయన పేర్కొన్నారు.. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఎదురవకుండా స్ట్రీట్ వెండర్స్ కు వెండర్ కార్డులతో సహా తమ వ్యాపారాలు పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వ చిరు వర్తులకు వ్యతిరేకం కాదని, స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ – 2014కు అనుగుణంగా చట్టబద్ధమైన వ్యాపారాలు చేసుకునేందుకు అండగా ఉంటుందని వంశీకృష్ణ చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉండగా నగరంలో ఫుడ్ కోర్ట్, వీధి వ్యాపారాలు తొలగింపు చర్యలను ఖండించారు. ఏళ్ల తరబడి చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకొని జీవనోపాధి సాగిస్తున్న పేదలు ఒక్కసారిగా తమ వ్యాపారాలను తొలగిస్తే రోడ్డున పడతారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తమ వ్యాపారాన్ని నమ్ముకొని పిల్లల చదువు, ఇతర అవసరాలకు అప్పులు చేసుకుని బ్రతుకుతున్న వారి జీవనశైలని ప్రజాప్రతినిదిగా అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చిరువర్తకుల బ్రతుకులు అధోగతి పాలవకుండా రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరి జీవనం మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుందే కానీ వ్యతిరేక కార్యకలాపాలకు పూనుకోదనే వివరించారు. ఎన్నికల ముందు కూటమి పార్టీలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్ట్రీట్ వెండర్స్ తొలగింపులపై ప్రతిపక్ష పార్టీలు చేసే విమర్శలు అసత్య ప్రచారాలేనని తిప్పి కొట్టారు. తొలగింపులను భూతంగా చూపి తమ పబ్బం గడుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. వీధి వ్యాపారస్తుల వ్యాపార బాధ్యత వారి రక్షణ రాష్ట్ర ప్రభుత్వాన్ని దేనిని గుర్తు చేశారు. దీనిపై వీధి వ్యాపారస్తులు ఎలాంటి సందేహం లేకుండా ధైర్యంగా ఉండాలని, అసెంబ్లీ సమావేశాలు ముగియగానే తమ వ్యాపారాలను యధావిధిగా నిర్వహించుకునేలా వెండర్ కార్డులు పంపిణీ చేసి రక్షణ కల్పిస్తానని వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

