ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

విశాఖపట్నం

 

*14 వార్డల్లో తొలగించిన తోపుడు బళ్ళు బడ్డీల ను అక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకునేటట్టు అవకాశం డిమాండ్*

 

18-9-2025 ఎస్ఎఫ్ఐ స్కూలు ఏపీ ఈపీడీసీఎల్ దగ్గర గురుద్వారా అక్కయ్యపాలెం రైతు బజార్ దగ్గర ఉత్తర నియోజకవర్గం జీవీఎంసీ అధికారులు హ్యాకర్ జోన్స్ ఏర్పాటు చేసే వరకు తొలగించిన తోపుడు బళ్ళును బడ్డీలు అక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకునేటట్టు. అవకాశం కల్పించాలని

 

 ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి జీవీఎంసీ సీసీపీతో మాట్లాడి

మీ సమస్య పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు

 

ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు షేక్. రహిమాన్ మాట్లాడుతూ ఆపరేషన్ లంగ్స్ పేరుతో జీవీఎంసీ అధికారులు నగరంలో అనేక ప్రాంతాల్లో ముందస్తు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా అక్రమంగా తోపుడు బళ్ళు చిన్నచిన్న బడ్డీలు పొక్లేన్లు తో బడ్డీలు ధ్వంసం చేసి వారికి ఉపాధి లేకుండా జీవన భృతిపై మానసికంగా ఆర్థికంగా దెబ్బ కొట్టి వేలాది మందిని రోడ్డు మీదకు నెట్టడం సరైన విధానం కాదని దుయ్యబట్టారు

 

గ్రేటర్ విశాఖ నగర పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇదే పద్ధతుల్ని కొనసాగించి ఇబ్బందులు గురి చేశారు, కార్పొరేటర్లు జీవీఎంసీ కమిషనర్ కౌన్సిల్ లో తీర్మానం చేసి మేయర్ కార్పొరేటర్లు విహారయాత్రలకు వెళ్లిపోయి ప్రజా ప్రతినిధులు గా ఉండి నగరంలో జీవీఎంసీ అధికారులు చిరు వ్యాపారస్తులపై ఇంత పెద్ద ఎత్తున విద్వాంశం జరుగుతున్న కనీసం మేయర్, కార్పొరేట్లలు నోరు మెదపకుండా వారి విహారయాత్రకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ వారి యాత్రను పూర్తి చేసుకున్నారు తప్ప ప్రజా ప్రయోజనాలు గారికి వదిలేశారు అని విమర్శించారు

 

2014 సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రకారంగా హాకర్ జోన్స్. గుర్తింపు కార్డు మంచినీరు సౌకర్యం టాయిలెట్లు మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి అని ఉన్నప్పటికీ ఇవన్నీ ప్రక్కన పెట్టి. జీవీఎంసీ కమిషనర్ అధికారులు తో పోలీస్ వారి ప్రక్కన పెట్టుకొని భయభ్రాంతులకు గురిచేసి ఇంత అన్యాయంగా తొలగించడం బాధాకరం

 

హాకర్ జోన్ ఏర్పాటు చేసే వరకు

తొలగించిన తోపుడు బళ్ళు చిన్న చిన్న బడ్డీలు అక్కడే పెట్టుకొని వ్యాపారం చేసుకొనే విధంగా అవకాశం కలిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎం. మన్మధరావు ఆటో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్. కాసుబాబు, బత్తులు, భాస్కర్, ఏ. వెంకటలక్ష్మి, ఆర్, కృష్ణ,

ఈ. సన్యాసమ్మ, ఆర్. మాధవ,

కే. దేవుడమ్మ తదితరులు

పాల్గొన్నారు

 

ఇట్లు

షేక్. రహిమాన్

అధ్యక్షులు

విశాఖ జిల్లా. ఉపాధ్యక్షులు. ఏఐటీయూసీ

9441574519

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *