img 20251026 wa0024

నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి. – జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్నం

విశాఖపట్నం . అక్టోబర్ 26.. కలం లీడర్ న్యూస్

 

సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు కార్యక్రమం దగ్గర పడుతోంది.

 

*నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి.

 

– జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ .

 

విశాఖపట్నం అక్టోబర్ 26: విశాఖ వేదికగా జరుగనున్న

అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కు తక్కువ కాలం ఉన్నందున సంబంధిత నగర సుందరీకరణ , సంబంధిత అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన జోన్ 3, 4, 5, 8 లోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తాటిచెట్లపాలెం, ఊర్వసి జంక్షన్, ఎన్ఏడి ఫ్లై ఓవర్, ఎయిర్పోర్ట్ వరకు, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ లో సి ఐ ఐ భాగస్వామ్య సదస్సు ప్రధాన వేదిక ప్రాంతం, అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సు కొరకు చేపడుతున్న అభివృద్ధి, నగర సుందరీకరణ పనులను జీవీఎంసీ అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ అర్బన్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.

 

ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్ మాట్లాడుతూ నవంబర్ నెలలో విశాఖ వేదికగా జరుగనున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు కాలం తక్కువగా ఉన్నందున నగర సుందరీకరణతో పాటు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ కింద చేపడుతున్న సుందరీకరణ పనులతో పాటు రైల్వే న్యూ కాలనీ రోడ్డు ,తాటిచెట్లపాలెం, ఊర్వసి , ఎన్.ఎ.డి ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ హైవే వరకు చేపడుతున్న రోడ్ డివైడర్స్, సెంటర్ మీడియన్, ఐలాండ్స్ , ఫుట్ పాతులు, రోడ్డు మరమ్మతులు, లైటింగ్,పెయింటింగ్ పనుల నాణ్యతను పరిశీలించి, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే సెంటర్ మీడియన్ లలో మొక్కలను యూనిఫామ్ గా ఆకర్షణీయంగా ట్రిమ్మింగ్ చేయాలని, పెద్ద చెట్లు యొక్క బ్రాంచెస్ కటింగ్ చేయడంతో పాటు సెంటర్ మీడియన్ లలో పాడుబడిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటాలని ఆదేశించారు. అనంతరం అంతర్జాతీయ వేదిక జరిగే ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ హెలిప్యాడ్ ను పరిశీలించి అక్కడ చేపడుతున్న పెయింటింగు, సుందరీకరణ పనులను పరిశీలించి పనులలో నాణ్యతా ప్రమాణాలను తప్పకుండా పాటించి త్వరగా పూర్తిచేయాలని కమిషనర్ ఆదేశించారు.

 

ఈ పర్యటనలో పర్యవేక్షక ఇంజనీరు కె.శ్రీనివాసరావు,కార్యనిర్వహక ఇంజనీరు తారా ప్రసన్న, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

 

పౌర సంబంధాల అధికారి ,

జీవీఎంసీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *